
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సామ్‌కి జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. ఒకపక్క షూటింగ్ చేస్తూనే.. మరోపక్క విరామ సమయంలో సెర్బియా అందాలను వీక్షిస్తుంది సమంత.
(చదవండి: సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక )
ఇక తాజాగా సెర్బియాలోకి ఓ క్లబ్‌కి వెళ్లిన సామ్.. సరదాగా ‘ఊ అంటావా మావా’ పాటకు స్టెప్పులేసి అలరించింది. సామ్ కాలు కదపగానే అక్కన ఉన్నవారంతా జోష్‍తో చిందేశారు. పక్కనే వరుణ్.. డ్యాన్స్ చేయాలంటూ సమంతను ఎంకరేజ్ చేశాడు. బెల్‍గ్రేడ్ క్లబ్‍లో సమంత డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడు కోలుకొని ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం పట్ల కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది ఇప్పుడు ఇలా బీర్ కొడుతూ డ్యాన్స్ చేయడం అవసరమా? అని కామెంట్ చేస్తున్నారు.
Samantha item song craze is unbelievable 🥵🥵#SamanthaRuthPrabhu #Pushpa pic.twitter.com/BNZ2V6BOwj
— Actress Glam (@actressglam) June 10, 2023