నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్‌ | Samantha Shares Emotional Post On Her Fans Meet After Long Time, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samantha Comments On Her Fans Meet: నా గుండె నిండిపోయింది అంటూ సమంత ఎమోషనల్‌

Published Mon, Mar 25 2024 8:53 AM | Last Updated on Mon, Mar 25 2024 10:43 AM

Samantha After Long Time Meet Her Fans - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సుమారు ఏడాది తర్వాత ఆమె కెమెరాల ముందుకు వస్తుంది. మయోసైటిస్​ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చినా.. ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొచ్చింది. తన నటనతో, అందంతో సౌత్‌లో భారీగా అభిమానులను సంపాదించుకున్న సమంత..సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. దీని కోసం ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్​ ఈవెంట్​లో ఆమె సందడి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకుంది.

హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్‌ కోసం సమంత ఒక స్పెషల్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో సమంతను కలుసుకునేందుకు భారీగా అభిమానులు వచ్చారు. ఎవరినీ నిరుత్సాహ పరచకుండా ఆమె అందరితో కలిసి ఫోటోలు దిగింది.  అభిమానులు ప్రేమతో తెచ్చిన మంచి మంచి గిఫ్ట్స్ తీసుకుంది. ఓ మహిళా అభిమాని ఏడుస్తూ సమంతని హగ్ చేసుకోగా సామ్ కూడా ఎమోషనల్‌ అయింది. అంతే కాకుండా తన కోసం తయారు చేసిన 'వండర్ ఉమెన్​' కేకును ఆమె కట్​ చేసింది. అభిమానులు చూపించిన ప్రేమకు సమంత కూడా ఫిదా కావడంతో పాటు ఎమోషనల్‌ అయిపోయింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

సమంత ప్రస్తుతం యాడ్ షూట్లతో బిజీగా ఉంది. ఇప్పటికే మోహన్‌లాల్‌తో ఒక యాడ్‌లో నటించింది. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పటి వరకు అయితే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించలేదు. కోలీవుడ్‌లో విజయ్‌ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న ఒక ప్రాజెక్ట్‌లో సమంత నటించనుందని టాక్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement