Samantha Attend 'Citadel' Premiere In London, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: బ్లాక్‌ డ్రెస్‌లో సమంత సరికొత్త లుక్‌.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Published Wed, Apr 19 2023 8:18 PM | Last Updated on Thu, Apr 20 2023 12:11 PM

Samantha Attend Citadel Premiere In London Pics Goes Viral - Sakshi

మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సమంత ఈమధ్య బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా కేరళలో ఖుషి షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు సిటీడెల్‌ కోసం లండన్‌ వెళ్లింది.రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఈ సిరీస్ ఏప్రిల్ 28న అమెజాన్‏లో స్ట్రీమింగ్ కానుంది.

ఇదే సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్‌ అండ్‌ డేకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా  హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్‌ లండన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక, రిచర్డ్‌లతో పాటు సమంత, వరుణ్‌ ధావన్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రిమియర్‌కు హాజరైన సమంత ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

బ్లాక్‌ డ్రెస్‌లో, డైమండ్‌ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, పలువురు సెలబ్రిటీలు వావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ కూతురు ఆ‍శ్రిత సైతం సామ్‌ లుక్స్‌కి స్టన్నింగ్‌ అంటూ రిప్లై ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement