Actress Samantha Say 13th July Is a Special Day for Her - Sakshi
Sakshi News home page

జులై 13 నాకు చాలా స్పెషల్‌ : సమంత

Jul 13 2023 1:12 PM | Updated on Jul 13 2023 1:39 PM

Samantha Say 13th July Is Special day For Her - Sakshi

సమంత త్వరలోనే సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నరనే ప్రచారం గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ సర్కిల్‌లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు ‘ఖుషి’, సిటడెల్‌’ ల షూటింగ్స్‌ కంప్లీట్‌ చేసి..  ఆ తర్వాత ఏడాది పాటు రెస్ట్‌ తీసుకోనున్నారట. ఈ ఏడాది మొత్తం తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నారట. 

ప్రస్తుతం సమంత, విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తోంది. దీంతో పాటు సిటడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తుంది. ఇప్పటికే ఖుషి షూటింగ్‌ పూర్తి చేసుకున్న సామ్‌.. తాజాగా సీటడెల్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు సిటడెల్‌ వెబ్‌సిరీస్‌ పూర్తయింది’అని రాసుకొచ్చింది. ఇక సిటడెల్‌ విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటడెల్‌కు ఇండియన్‌ వెర్షన్‌ ఇది. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో వరుణ్ ధావన్‌, సమంత కీలక పాత్రలు పోషించారు. 

రీఎంట్రీ ఉంటుందా?
సిటడెల్‌, ఖుషి చిత్రాల రిలీజ్‌ తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. అప్పుడు కూడా కనిపిస్తుందో లేదో అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌లన్నీ తిరిగి ఇచ్చేస్తుందట సమంత. ఏడాది తర్వాత అయినా సరే మాతో చిత్రం చేయండి అని అడ్వాన్స్‌  అందిస్తున్నా.. ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారట. దీంతో ఇకపై ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

(చదవండి: హోటల్‌లో డైరెక్టర్‌ తనతోపాటే రాత్రి ఉండిపోమన్నాడు: సింగర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement