Samantha to take a year-long break from films after 'Kushi' and 'Citadel' to focus on health - Sakshi
Sakshi News home page

Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. సినిమాలకు బ్రేక్‌, చివరి మూవీ ఇదే!

Published Wed, Jul 5 2023 10:17 AM | Last Updated on Wed, Jul 5 2023 11:13 AM

Samantha Is Going To Take Long Break From Films - Sakshi

అభిమానులకు, నిర్మాతలకు స్టార్‌ హీరోయిన్‌ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్‌’వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ నడుస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ పూర్తయిన తర్వాత సమంత లాంగ్‌ బ్రేక్‌ తీసుకోనున్నారట.

ఇకపై ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారట. దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె కొత్త సినిమాలకు సైన్‌ చేస్తారట. ఆ లోపు ఖుషి సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఆమె హాజరవుతారవుతున్నట్లు సమాచారం.

(చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్‌ అర్థమేంటి?)

కొత్త సినిమాలకు కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి నిర్మాతలకు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్‌ సినిమాలు చేస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది గ్యాప్‌ తర్వాత తిరిగి కచ్చితంగా సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి  సమంత నిర్ణయంతో అటు ఫ్యాన్స్‌, ఇటు నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement