ఫైనల్లీ గుడ్‌న్యూస్‌ చెప్పిన సమంత | Samantha Ruth Prabhu To Begin Shooting For Upcoming Movie, Instagram Story Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Movie Shooting: ఫైనల్లీ గుడ్‌న్యూస్‌ చెప్పిన సమంత

Published Sun, Feb 11 2024 10:38 AM | Last Updated on Sun, Feb 11 2024 12:01 PM

Samantha Ruth Prabhu Came Back Movie Shooting - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత అనారోగ్యం కారణంగా సుమారు 10 నెలలుగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. చివరగా శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత సినిమాలు ఒప్పుకోలేదు. కానీ ముందుగా ఒప్పందం ప్రకారం 'సిటడెల్‌' వెబ్‌సిరీస్‌ మాత్రం అనారోగ్యం ఉన్నా పూర్తి చేశారు.  2023లో ఖుషి సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన తర్వాత, తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు సినిమాలకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుట పడినట్లు ఉంది. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను సమంత పోస్ట్‌ చేశారు. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నట్లు అందులో అధికారికంగా ప్రకటించారు. 'ఇప్పటికే చాలామంది ఎప్పుడు మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు అని అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఫైనల్లీ ఆ సమయం వచ్చింది. త్వరలో షూటింగ్స్‌లలో పాల్గొంటున్నాను. కొన్నిరోజుల పాటు నేను కూడా నిరుద్యోగిగా ఉన్నాను. నా స్నేహితులతో కలిసి ఆరోగ్య పోడ్‌కాస్ట్‌పై ఒక కార్యక్రమం చేశాం. త్వరలో దానికి సంబంధించిన వీడియో విడుదల అవుతుంది.' అని సమంత తెలిపారు. 

వీడియోలో,  ఎరుపు రంగు దుస్తులలో మేకప్‌ లేకుండా కనిపించిన సమంత ఎంతో గ్లామర్‌గా ఉన్నారు. అలాగే సమంత కూడా పోడ్ కాస్ట్ గురించి మాట్లాడారు. గత డిసెంబర్‌లో తన ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రకటించిన ఆమె తిరిగి షూటింగ్స్‌లలోకి  రావడం పట్ల తన ఉత్సాహాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమంత చివరిగా ఖుషీ చిత్రంలో కనిపించారు. తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్. ఇది హాలీవుడ్ యాక్షన్ సిరీస్  బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించారు. వీరిద్దరూ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రాజ్ DK నిర్మించిన ఈ సిరీస్ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. త్వరలో ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement