తారలు మెరిసే... ఫ్యాన్స్‌ మురిసే... | Samantha, Priyanka Chopra shine at Citadel Honey Bunny London screening | Sakshi
Sakshi News home page

తారలు మెరిసే... ఫ్యాన్స్‌ మురిసే...

Published Thu, Sep 26 2024 4:11 AM | Last Updated on Thu, Sep 26 2024 3:37 PM

Samantha, Priyanka Chopra shine at Citadel Honey Bunny London screening

ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్‌ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్‌ ధావన్, సమంత లీడ్‌ రోల్స్‌లో రూ΄÷ందిన స్పై యాక్షన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు.

 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. 

ఇక రిచర్డ్‌ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్‌ రోల్స్‌లో దర్శక ద్వయం న్యూటన్‌ థామస్‌– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్‌ స్పై యాక్షన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’కు ఇండియన్‌ వెర్షన్‌గా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్‌ ‘సిటాడెల్‌’ తొలి సీజన్‌ 2023 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అలాగే ‘సిటాడెల్‌’కు సెకండ్‌ సీజన్‌ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్‌లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement