Jyothika and Thalapathy Vijay to reunite on screen after 20 years - Sakshi
Sakshi News home page

Jyothika: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక

Published Mon, Aug 14 2023 8:40 AM | Last Updated on Mon, Aug 14 2023 9:03 AM

Jyothika 20 Years After Entry With Vijay - Sakshi

నటి జ్యోతిక.. అప్పట్లో అజిత్‌, విజయ్‌, శింబు వంటి క్రేజీ హీరోలతో జత కట్టి విజయాలను అందుకున్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో టైటిల్‌ పాత్రలో సత్తాచాటారు. అలాంటి సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత నటనకు కొంత కాలం దూరంగా ఉండి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అలా జ్యోతిక రెండవ ఇన్నింగ్‌లో నటించిన తొలిచిత్రం 36 వయదినిలే (36 వయసులో) మంచి విజయాన్ని సాధించింది.

(ఇదీ చదవండి: నానికి నోటిదూల అంటూ.. టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ ఫైర్‌)

ఆ తర్వాత వరుసగా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్‌ నుంచి గతంలో ఖుషి, తిరుమలై వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. అలా చివరిగా 2003లో తిరుమలై చిత్రంలో విజయ్‌, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో గానీ 20 ఏళ్ల తర్వాత విజయ్‌, జ్యోతిక మళ్లీ కలిసి నటించబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

లియో చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్‌ తదుపరి వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని విజయ్‌ సరసన జ్యోతిక నటిస్తున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. ఎస్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించనున్నారు. కాగా లియో చిత్రం అక్టోబర్‌ 19వ తేదీన తెరపైకి రానుంది. ఈలోగా విజయ్‌ 68వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement