‘లైగర్‌’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Opens Up Liger Result | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ‘లైగర్‌’ ద్వారా విలువైన పాఠం నేర్చుకున్నా: విజయ్‌ దేవరకొండ

Published Tue, Nov 8 2022 9:04 PM | Last Updated on Tue, Nov 8 2022 9:04 PM

Vijay Devarakonda Opens Up Liger Result - Sakshi

‘లైగర్‌’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇద్దామనుకున్న విజయ్‌ దేవరకొండ భారీ షాక్‌ తగిలింది. భారీ అంచనాల మధ్య  ఈ ఏడాది ఆగస్ట్‌ 25న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా ‘లైగర్‌’ నిలిచింది. ఈ మూవీ డిజాస్టర్‌ కారణంగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘జనగనమణ’ కూడా మధ్యలోనే ఆగిపోయింది.

అయితే ఒక మూవీ హిట్‌ కొట్టలేదనే కారణంగా తాను మాత్రం విరామం తీసుకోబోనని విజయ్‌ అంటున్నాడు. లైగర్‌ ఒక నటుడిగా, వ్యక్తిగా తానేంటో తనకు చూపించిందన్నారు. ఈ సినిమా ద్వారా విలువైన పాఠాన్ని నేర్చుకున్నట్లు విజయ్‌ చెప్పారు. ప్రస్తుతం విజయ్‌ ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌. సామ్‌ అనారోగ్యం కారణంగా ‘ఖుషి’ షూటింగ్‌ నిలిచిపోయింది. ఆమె కొనుకోగానే మిగతా షూటింగ్‌ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement