Netizens Trolls On Samantha Over Regressive Poster In Kushi Aaradhya Song, Deets Inside - Sakshi
Sakshi News home page

Trolls On Samantha Over Kushi Song:‍ సామ్‌పై ట్రోలింగ్.. అలా చేయకపోయింటే!

Published Wed, Jul 12 2023 9:23 PM | Last Updated on Thu, Jul 13 2023 8:39 AM

Trolling On Samantha Kushi Song - Sakshi

Samantha Trolling: 'ఖుషి' సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. 'ఆరాధ్య' పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పిక్చరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్, ట్యూన్ వరకు ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి. ఇప్పటికే 'నా రోజా నువ్వే' పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకెళ్తుండగా, దానికి ఇది కాంపిటీషన్ లా కనిపిస్తుంది. అదే టైంలో ఈ సాంగ్ లోని ఓ సీన్ వల్ల సమంతకు కొత్త తలనొప్పి వచ్చినట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!)

కొన్నాళ్ల పాటు బ్రేక్
సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయిపోయాయి. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం దృష్ట్యా ఓ ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని సామ్ భావించిందని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. సరే అది పక్కనబెడితే 'ఖుషి' సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది. పాటలు అవి చూస్తుంటే హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.

ఆ ట్వీట్ వల్ల
'ఆరాధ్య' అని వచ్చిన ఈ పాటలో ఓ చోట.. సమంత కుడి చేతిపై విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేస్తున్నట్లు ఓ స్టిల్ ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. సామ్ గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్ ని బయటకు తీశారు. అందులో.. 'ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి' అని రాసుకొచ్చింది. అయితే అది 'వన్ నేనొక్కడినే' పోస్టర్ అని చాలామంది అన్నారు. ఇప్పుడు ఆ ఫొటోని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన బెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

(ఇదీ చదవండి: నయన్ భర్తకు వార‍్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement