స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌లో జరపుకుంది. ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ సినిమా షూటింగ్ మార్చిలో తిరిగి ప్రారంభ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
కాగా మయోసైటీస్ వ్యాధి కారణంగా సమంత షూటింగ్స్‌కి కొంచెం విరామం ఇవ్వడంతో ‘ఖుషి’ చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత ఇటీవల ముంబైలో జరిగిన హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో త్వరలో ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ను కూడా షురూ చేయనున్నారామె. మార్చి మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్‌లో విజయ్, సమంతలు పాల్గొంటారని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే ‘ఖుషి’ ని గత ఏడాది డిసెంబరు 23న రిలీజ్ చేయాలనుకున్నారు.. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment