సమంత ఇప్పుడు ఫుల్ ఫిట్‌గా తయారైయింది. మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని హుషారుగా తిరుగుతోంది. జిమ్ కూడా చేస్తుంది. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఖుషి’ సెట్‌లో అడుగుపెట్టింది.
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గతేడాదిలోనే స్టార్ట్ అయింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు మళ్లీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న సమంత ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొంది.
ఈ క్రమంలోనే మైత్రీ మూవీ మేకర్స్.. సామ్‌కు గ్రాండ్‌గా స్వాగతం పలికింది. మహిళా దినోత్సవంతో పాటు టాలీవుడ్‌లో13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్, శివ నిర్వాణ, మైత్రీ ప్రొడ్యూసర్స్ సమంతకు శుభాకాంక్షలు తెలియజేయగా.. ఆమె హ్యాపీ మూడ్‌లో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment