నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇలా ఏ మాత్రం తీరక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక..ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇండియన్ కోచర్ వీక్ 15వ ఎడిషన్ కోసం రష్మిక తొలిసారి ర్యాంప్ వాక్ చేసింది. ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ లెహంగా ధరించి, చిరునవ్వులు చిందిస్తూ రష్మిక చేసిన ర్యాంప్ వాక్ నెట్టింట తెగ వైరల్ అయింది.
తాజాగా తన తొలి ర్యాంప్ వాక్ అనుభవం గురించి చెప్పుకుంటూ తనకు సహాయం చేసిన వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ‘ఢిల్లీలో మొదటిసారి ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నాను. నేను ప్రో మోడల్ లాగా నడవడానికి చాలా ప్రయత్నం చేశాను.. కానీ అది వర్కౌట్ కాలేదు. నేను కేవలం నవ్వుతూ సరదాగా గడిపే నాకు ఈ ఫ్యాషన్ షో ఓ బ్లాస్ట్‌లా ఉంది.
నా తొలి నడకకి సహాయం చేసిన వరుణ్‌కి థ్యాంక్స్. ఈ ర్యాంప్ వాక్ నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నేను మీ కళను ప్రేమిస్తున్నాను. మనం కలిసి మరిన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. నాకు సహాయం చేసిన అందరికి కృతజ్ఞతలు’ అంటూ రషఙ్మక రాసుకొచ్చింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment