
భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ ర్యాంప్పై నడుస్తూ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు. కరీనా త్వరలో తల్లి కాబోతున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించి బెబో ర్యాంప్పై మెరిసి.. షో స్టాపర్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఆమె కళ్ల నిండా నీళ్లతో ఉద్వేగానికి లోనయ్యారు.
దీనిపై కరీనా మాట్లాడుతూ.. ఇవి జీవితంలో ప్రత్యేకమైన క్షణాలని, తల్లి కాబోతున్న తనకు ఈ ర్యాంప్ వాక్ ఓ మధురమైన జ్ఞాపకమని, ప్రస్తుతం చాలా ఎమోషనల్గా ఉన్నానని అన్నారు. ఇంతకుముందు సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేయలేదని, ఇదే తొలిసారని చెప్పారు. అలాగే తన కోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందించినట్లు తెలిపారు.