
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమన్: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. అంతే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఏ అంశంలోనైనా పట్టుబడ్డ వారిని ఉరి తీస్తామని జోర్డాన్ ప్రభుత్వం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీచేసింది.
2013 డిసెంబర్‌లో సిరియాలోని రక్కా సమీపంలో నిర్బంధించిన జోర్డాన్ పైలట్ మోజ్ అల్ - కసస్ బెహ్‌ను ను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపారు. ఒక బోనులో నిలబెట్టి మంటలు అంటించి సజీవదహనం చేశారు. ఇస్లామిక్ స్టేట్ మంగళవారం ఈ వీడియో దృశ్యాలను విడుదల చేసింది. కాగా పైలట్‌ను విడిపించేందుకు తమ వద్ద బందీగా ఉన్న ఐఎస్‌ఐఎస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ చెప్పినా కూడా ఉగ్రవాదులు పైలట్‌ను పొట్టన పెట్టుకున్నారు.