
బోనులో పెట్టి..పెట్రోల్ పోసి సజీవ దహనం
డిసెంబర్‌లో తాము నిర్బంధించిన జోర్డాన్‌కు చెందిన పైలట్‌ను సజీవంగా దహనం చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ మంగళవారం వీడియో దృశ్యాలను విడుదల చేసింది.
బీరుట్: డిసెంబర్‌లో తాము నిర్బంధించిన జోర్డాన్‌కు చెందిన పైలట్‌ను సజీవంగా దహనం చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ మంగళవారం వీడియో దృశ్యాలను విడుదల చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగాసిరియాలో చేపట్టిన సంకీర్ణ చర్యల్లో పాల్గొన్న జోర్డాన్‌కు చెందిన ఎఫ్-16 జెట్ విమానం డిసెంబర్ 24న కుప్పకూలింది.
ఆ విమాన పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను ఐఎస్ ఉగ్రవాదులు నిర్బంధించారు. జోర్డాన్‌లో జైలులో ఉన్న ఇరాకీ మహిళా ఆత్మాహుతి బాంబు సాజిదా అల్ రిషావీని తమకు అప్పగించకుంటే పైలట్‌ను చంపేస్తామని ఐఎస్ హెచ్చరించింది. తాజా వీడియోలో ఈ పైలట్‌ను ఇనుపబోనులో ఉంచి పెట్రోలు పోసి సజీవం గా దహన దృశ్యాలు ఉన్నాయి.