బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి | State media: 14 Palestinians killed in Jordan bus accident | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి

Published Thu, Mar 17 2016 10:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి

బస్సు బోల్తా : 14 మంది యాత్రికులు మృతి

అమ్మాన్ :  దక్షిణ జోర్డాన్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది.  ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. ఈ మేరకు మీడియా సంస్త పెట్రా గురువారం వెల్లడించింది. బుధవారం అర్థరాత్రి జోర్డాన్ నగరం మాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. అధిక వేగంతో వెళ్తున్న బస్సు వేగాన్ని నియంత్రించడంలో డ్రైవర్ విఫలమయ్యాడని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని మీడియా చెప్పింది. వీరంతా బస్సులో మక్కా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. మృతులంతా పాలస్తీనీయన్లని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement