‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’ | Prithviraj Wishes His Wife Supriya On His 9th Wedding Anniversary | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’

Apr 25 2020 3:19 PM | Updated on Apr 25 2020 3:27 PM

Prithviraj Wishes His Wife Supriya On His 9th Wedding Anniversary - Sakshi

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌‌ సుకుమారన్‌ ఈ రోజు(శనివారం) తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సందర్భంగా భార్య సుప్రీయ మీనన్‌కు పృథ్వీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పృథ్వీరాజ్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ‘ఆదుజీవితం’’ సినిమా షూటింగ్‌ కోసం జోర్డాన్‌ వెళ్లిన ఆయన లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర యూనిట్‌తో సహా అక్కడే చిక్కుకుపోయారు. ఈ ప్రత్యేక రోజున పృథ్వీరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ... ‘9 సంవత్సరాలు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం’ అంటూ భార్య మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. (లాక్‌డౌన్‌.. 9.30 గంటలు బెడ్‌పైనే స్టార్‌ హీరో)

అలాగే సుప్రియ కూడా భర్త పృథ్వీకి పెళ్లి రోజు విషెస్‌ తెలిపారు. ‘9వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ తొమ్మిదేళ్లలో మొదటిసారి మనం పెళ్లి రోజున వేరువేరుగా ఉన్నాం. త్వరగా వచ్చి విషెస్‌ చెబుతారని మీ కోసం ఎదురు చూస్తున్నాను’. అంటూ పెళ్లినాటి ఫోటోను షేర్‌ చేశారు. కాగా పృథ్వీరాజ్‌ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. వీరికి 2014 సెప్టెంబర్‌ 8న కూతురు అలంకృత జన్మించింది. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ? )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement