Jordan Restaurant Offers Post Meal Naps To Who Eat Mansaf - Sakshi
Sakshi News home page

తిన్న తర్వాత పడుకునే సౌకర్యం.. జోర్డాన్‌లో స్పెషల్ హోటల్.. 

Published Sat, Jul 22 2023 6:32 PM | Last Updated on Sat, Jul 22 2023 6:36 PM

Jordan Restaurant Offers Post Meal Naps To Who Eat Mansaf - Sakshi

అమ్మాన్: జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా పడుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకునే తీరాలని చెబుతోంది సదరు రెస్టారెంట్ యాజమాన్యం. 

కడుపునిండా భోజనం చేసిన తర్వాత ఎవ్వరికైనా కాసేపు నడుము వాల్చాలనిపించడం సహజం. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి కలిగే ఆ హాయి మాటల్లో చెప్పలేనిది. ఇంటిలో అయితే తిన్న తర్వాత పడుకున్నా పర్వాలేదు కానీ రెస్టారెంట్‌లో ఆ రేంజిలో తిన్న తర్వాత పడుకోవడం కుదరదు కదా. 

కానీ జోర్డాన్‌ రాజధాని అమ్మాన్ లోని ఒక రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు. అందుకోసం అక్కడ ఏసీ గదులను కూడా ఏర్పాటు చేసింది ఆ రెస్టారెంట్ యాజమాన్యం. కాకపోతే ఆ రెస్టారెంట్ ఫేమస్ డిష్, జోర్దాన్ జాతీయ వంటకం అయిన "మన్సాఫ్" తిన్నవారికి మాత్రమే ఆ అవకాశముంటుంది. 

పులిసిన పెరుగుతో, స్వచ్ఛమైన నెయ్యితో ప్రత్యేకంగా తయారుచేసే మన్సాఫ్ తిన్న తర్వాత ఎంతటి వారికైనా కుంభకర్ణుడిలా నిద్ర తన్నుకొస్తుందట. అలా రాలేదంటే ఆ మన్సాఫ్ లో ఎదో లోపముండి ఉంటుందంటున్నారు ఆ రెస్టారెంట్‌కు విచ్చేసిన ఓ అతిధి.

ఇక ఆ హోటల్ సహ యజమాని ఒమర్ బైడీన్ మాట్లాడుతూ మన్సాఫ్ కోసం వాడే పదార్ధాలను తిన్న తర్వాత నిద్ర రావడం సహజమే. మొదట్లో దీన్ని జోక్ గా తీసుకున్నాము. కానీ ఈరోజు అదే ఈ హోటల్ ప్రత్యేకతను చాటింది. అందుకే నిద్రపోవడానికి సౌకర్యం కల్పించాలని ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. 

జోర్డాన్‌ వెళ్ళినప్పుడు కచ్చితంగా ఈ హోటల్‌కి వెళ్లి తీరతామని కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి హోటల్ మా ఊర్లో కూడా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. అంత దూరం వెళ్లలేమని భావించిన వారు మాత్రం మాన్సాఫ్ ఎలా తయారు చెయ్యాలో రెసిపీ తెలపమని కామెంట్లు చేస్తున్నారు.    

ఇది కూడా చదవండి: తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement