బాంబులతో పూలతోట పెంచారు
- పాలస్తీనాలో అరుదైన దృశ్యం
- వెస్ట్ బ్యాంక్ లో ఆకట్టుకుంటోన్న బాంబ్ గాడ్డెన్
వెస్ట్ బ్యాంక్ :
వివాదాస్పద నేల పాలస్తీనా లోని ఓ ప్లవర్ గార్డెన్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షింస్తోంది. ఎడారిలో పూలు పెంచడం వింత కాదు.. పూల తోటకు ఉపయోగించిన వస్తువులే వెరైటీ. వెస్ట్ బ్యాంక్ ముఖ్య పట్టణం రామల్లాలో కి దగ్గరలోని బిలిన్ గ్రామం నెటిజన్ల మనసు దోచుకుంది. వివాదాస్పద వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని రామల్లాలో సిటీకి దగ్గరలో ఈ బిలిన్ గ్రామం ఉంది. ఇజ్రాయిల్ దురాక్రమణ కింద ఉన్న ఈ గ్రామాన్ని.. రెండేళ్ల క్రిందట పాలస్తీనా తిరిగి స్వాధీనం చేసుకుంది.
అయితే..బిలిన్ గ్రామంలో బాంబు దాడులు, పేలుడు శబ్దాలు, రాకెట్ లాంచర్లు కొత్త కాదు. సరిహద్దు వివాదం కారణంగా అటు ఇజ్రాయిల్, ఇటు పాలస్తీనా ఉగ్రవాదులు ప్రతి నిత్యం పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉంటారు. 2014 మేలో అందుకు భిన్నంగా ప్రజలపై దాడి జరిగింది. శాతియుతంగా ప్రదర్శన చేస్తున్న పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ టియర్ గ్యాస్ గోళాలు, రబ్బర్ బుల్లెట్లతో విరుచుకు పడింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు గ్రామస్తులు.
అంతే.. ఇజ్రాయిల్.. పాలస్తీనా ప్రజలపై పేల్చిన టియర్ గ్యాస్ గోళాలను సేకరించడం మొదలు పెట్టారు. ఇజ్రాయిల్ అక్రమంగా కంచె నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతంలో పూల తోట పెంచడం స్టార్ట్ చేశారు. త్వరలోనే.. గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మొదలైంది. బాంబ్ షెల్ గార్డెన్ పెరిగి పోయింది. ఒక నాటికి యుద్దం ముగుస్తుంది.. 'మరణం నుంచి వసంతం చిగురిస్తుంది' అంటూ గ్రామస్తులు తమ పూదోట గురించి గర్వంగా చెబుతారు.