గాజా: గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ బలగాలు 48 గంటల వ్యవధిలో జరిపిన దాడుల్లో 89 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో శనివారం ఒక్క రోజే 48 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపైనా దాడికి దిగిందని, ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు వివరించింది. రోగులు, వారి సంబంధీకులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని పేర్కొంది.
కాగా, ఇజ్రాయెల్ ఆర్మీ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో శనివారం గాజాలో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. ఖాన్ యూనిస్ ఆస్పత్రిలో 10 మంది శిశువులకు టీకా వేశారని అధికారులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుముట్టింది. నాలుగు రోజులుగా ఇక్కడ దాడులు జరుపుతున్న ఆర్మీ నగరాన్ని మిగతా ప్రపంచంతో సంబంధాలు లేకుండా తెంచేసింది. మిలటరీ జీపులు, సాయుధ బలగాల వాహనాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ధ్వంసమైన కాంక్రీట్ గోడలు, శిథిల భవనాలు దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment