జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరోసారి దాడి చేయాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ దాడులపై తాజాగా ఇజ్రాయెల్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హెర్జి హలేవీ స్పందించారు. ఈ సందర్బంగా హలేవీ మాట్లాడుతూ..‘ఇరాన్ ప్రతిదాడి చేస్తే మా దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది. ఇరాన్‌ను ఎలా చేరుకోవాలో మాకు తెలుసు. మరోసారి దాడి చేస్తే ఇరాన్‌ను ఎలా గట్టిగా దెబ్బ కొట్టాలో మా దగ్గర ప్లాన్ ఉంది. ప్రస్తుతం కావాలనే కొన్ని లక్ష్యాలను పక్కన పెట్టాము. వాటిపై మరో సందర్భంలో గురిపెడతాము. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులను తట్టుకోలేరు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదే సమయంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా స్థానంలో డిప్యూటీ హెడ్ నయీమ్ ఖాసీమ్‌ను ఎంపిక చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హిజ్జుల్లా ప్రకటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఈ సందర్బంగా గల్లంట్ మాట్లాడుతూ.. నయీమ్ ఖాస్సెమ్ నియామకం తాత్కాలికం మాత్రమే. అతను ఎక్కువ కాలం ఉండలేడు. అతడికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది అని చెప్పారు. గత నెలలో దక్షిణ బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా చనిపోయిన విషయం తెలిసిందే.
మరోవైపు.. గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజా వ్యాప్తంగా 143 మంది, లెబనాన్‌లో 77 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక, లెబనాన్‌లో భూతల దాడులకు వెళ్లి 33 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
🎥 Video is in Hebrew 🇮🇱
Chief of the General Staff, LTG Herzi Halevi, visited the "Ramon" Airbase today and met with pilots and the ground crews who were involved in the recent strikes against.
Halevi warned, "If Iran makes the mistake of launching another missile barrage at… pic.twitter.com/bH61AwMQX5— 🇮🇱 Am Yisrael Chai 🇮🇱 (@AmYisraelChai_X) October 30, 2024
Comments
Please login to add a commentAdd a comment