జెరూసలేం: గాజాలోని హిజ్బుల్లా మిలిటరీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను హతమారిచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కింది. కాగా, ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడికి ఫువాద్ కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇజ్రాయెల్ మిలటరీ తెలిపిన వివరాల ప్రకారం..హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మృతిచెందాడు. బీరుట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అతడు మరణించాడు అని తెలిపింది. ఇక, ఇటీవల సాకర్ మైదానంలో దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు ఫువాద్ అని ఇజ్రాయెల్ పేర్కొంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అడ్మిరల్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. ఫువాద్ షుక్ర్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో అనేక మంది మరణాలకు అతడే కారణం. హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్ క్షిపణులు, క్రూయిల్ క్షిపణులు, యాంటీ-షిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.
ఫువాద్ షుక్ర్‌పై అమెరికా రివార్డు..
లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా షుక్ర్ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది.
Fuad Shukr: the man who killed 12 children in a soccer field on Saturday and is responsible of 30 years of Hezbollah terrorist attacks. pic.twitter.com/RuHO0W2py6
— Israel Defense Forces (@IDF) July 30, 2024
ఇదిలా ఉండగా.. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు రాకెట్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment