Hizbul commander
-
ఇజ్రాయెల్ అటాక్ సక్సెస్.. హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం
జెరూసలేం: గాజాలోని హిజ్బుల్లా మిలిటరీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ను హతమారిచ్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కింది. కాగా, ఆక్రమిత గోలన్ హైట్స్‌పై రాకెట్ దాడికి ఫువాద్ కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇజ్రాయెల్ మిలటరీ తెలిపిన వివరాల ప్రకారం..హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ మృతిచెందాడు. బీరుట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అతడు మరణించాడు అని తెలిపింది. ఇక, ఇటీవల సాకర్ మైదానంలో దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు ఫువాద్ అని ఇజ్రాయెల్ పేర్కొంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అడ్మిరల్ డేనియల్ హగారీ మాట్లాడుతూ.. ఫువాద్ షుక్ర్ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్ వ్యక్తి. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో అనేక మంది మరణాలకు అతడే కారణం. హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్ క్షిపణులు, క్రూయిల్ క్షిపణులు, యాంటీ-షిప్ రాకెట్స్, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.ఫువాద్ షుక్ర్‌పై అమెరికా రివార్డు..లెబనాన్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా షుక్ర్ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్ కార్ప్స్ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది. Fuad Shukr: the man who killed 12 children in a soccer field on Saturday and is responsible of 30 years of Hezbollah terrorist attacks. pic.twitter.com/RuHO0W2py6— Israel Defense Forces (@IDF) July 30, 2024ఇదిలా ఉండగా.. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్ చర్చలు రాకెట్ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. -
మనిషి గెలిచాడు..
కశ్మీర్‌లోని శ్రీనగర్ .. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత.. అనంతరం చెలరేగిన ఘర్షణలు.. కాల్పులు, రాళ్లదాడులు.. హింస.. కుయ్యికుయ్యి మంటూ పోలీసు వాహనాలు దూసుకెళ్తున్నాయి.. రోడ్డుపై మనిషన్నవాడు లేడు.. షాపులు, కార్యాలయాలు అన్నీ బంద్.. నగరమంతటా కర్ఫ్యూ.. బయటకి రావాలంటేనే అంతా భయపడుతున్న సమయమది.. ఆ సమయంలో జుబేదా బేగం.. తన భర్తతో కలిసి బయటకు వచ్చింది.. కర్ఫ్యూను ధిక్కరిస్తూ.. ఆమె చూపు పోలీసు వాహనాలపైనే ఉంది.. వాహనాల కంటపడకుండా జాగ్రత్తగా వెళ్తున్నారీ దంపతులు.. రాళ్లు విసురుతూ.. అక్కడక్కడా అల్లరి మూకలు.. ఓర్పుగా, నేర్పుగా ప్రమాదాలను తప్పించుకుంటూ నడిచి వెళ్తున్నారు జుబేదా భర్త భుజం మీద బియ్యం, పప్పుల మూట.. అలా వాళ్లు మైళ్ల దూరం నడిచారు.. ఎట్టకేలకు తమ గమ్యాన్ని చేరుకున్నారు.. - ఎవరైనా వీరిని చూస్తే.. కర్ఫ్యూ సమయంలో తమ వారి కోసం సరుకులు తెచ్చుకోవడానికి బయల్దేరిన ముస్లిం జంటలా కనిపిస్తారు.. కానీ ఇలా కర్ఫ్యూ సమయంలో ప్రాణాలకు తెగించి.. వీరు ఆహారాన్ని తీసుకువెళ్తోంది.. ఓ హిందూ కుటుంబం కోసం.. తమ నివాసానికి దూరంగా జవహర్ నగర్లో ఉన్న దివాన్‌చంద్ పండిట్, పక్కనే ఉంటున్న ఇతర హిందూ కుటుంబాల కోసం.. కర్ఫ్యూ సమయంలో వాహన సదుపాయం లేకపోవడంతో వీరు ఇలా మైళ్ల దూరం నడిచి వెళ్లారు. - దివాన్‌చంద్ పండిట్ భార్య, జుబేదా ఒకే స్కూళ్లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె నుంచి జుబేదాకు ఫోన్ వచ్చింది.. రెండ్రోజులుగా పస్తు.. ఇంట్లో తినడానికి ఏమీ లేదు.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పింది.. అంతే.. జుబేదా ఇంకేమీ ఆలోచించలేదు.. ప్రాణాలకు తెగించింది.. భర్తతో బయల్దేరింది.. దివాన్‌చంద్ భార్య ఫోనైతే చేసింది గానీ.. జుబేదా ఇలా వచ్చేస్తుందని అనుకోలేదు.. జుబేదాను చూడగానే.. దివాన్‌చంద్ కుటుంబం కంట కన్నీరు.. అటు వారి కడుపు నిండింది.. ఇటు జుబేదా గుండె ఆనందంతో నిండిపోయింది.. బయట రాళ్ల వర్షం.. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.. అక్కడ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అప్రస్తుతం.. ఇక్కడ మాత్రం మనిషి గెలిచాడు.. మానవత్వమూ గెలిచింది... -
కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత అరెస్ట్
నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన అగ్రనేతల్లో ఒకరైన తలిబ్ లలితోపాటు మరో ఇద్దరు తీవ్రవాదులను బండిపూర జిల్లాలో భద్రతాదళాలు ఈ రోజు అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. అజాస్ ప్రాంతంలో తీవ్రవాదులు ఆశ్రయం పొందినట్లు తమకు సమాచారం అందింది. ఆ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి తీవ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో పోలీసులకు, తీవ్రవాదులు తారసపడ్డారు. ఆ క్రమంలో ఇరువైపుల భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఆ ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు ఆదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. అయితే తీవ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఎవరు గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురు తీవ్రవాదులను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ వ్యాప్తికి తలిబ్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు వెల్లడించారు.