
టెల్‌అవీవ్: గాజా ప్రాంత నగరం రఫాపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులేనని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
తమ దాడుల్లో హమాస్ స్థావరం ధ్వంసం కాగా ఇద్దరు సీనియర్ మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈ ఘటనను పొరపాటున జరిగిన విషాదంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. రాత్రి వేళ జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తామని పార్లమెంట్‌లో ప్రకటించారు.