ఇజ్రాయెల్‌ డ్రోన్‌ వీడియో.. హమాస్‌ సిన్వర్‌ ఆఖరి క్షణాలు ఇలా.. | Israel Drone Captures Hamas Yahya Sinwar Final Moments | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ డ్రోన్‌ వీడియో.. హమాస్‌ సిన్వర్‌ ఆఖరి క్షణాలు ఇలా..

Oct 18 2024 10:51 AM | Updated on Oct 18 2024 12:46 PM

Israel Drone Captures Hamas Yahya Sinwar Final Moments

జెరూసలేం: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ మృతి చెందాడు. ఈ క్రమంలో చనిపోయే ముందు సిన్వర్‌ చివరి కదలికలకు సంబంధించిన సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యానికి చెందిన డ్రోన్‌.. సిన్వర్‌ కదలికలను వీడియో తీసింది.

ఇజ్రాయెల్‌ దాడులు జరుగుతున్న సమయంలో సిన్వర్‌ ఓ భవనంలో కూర్చుని ఉన్నాడు. బాంబు దాడుల తర్వాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. ఇజ్రాయెల్‌ బాంబుల దాడిలో సిన్వర్‌ తుదిశ్వాస విడిచే ముందు ఓ కూర్చిలో అచేతనంగా కూర్చుండిపోయాడు. సిన్వర్‌ కూర్చుని ఉండగా.. ఇజ్రాయెల్‌ డ్రోన్ అతడి వద్దకు వెళ్లింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. సిన్వర్‌ మృతిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నెతన్యాహు మాట్లాడుతూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. ఇది అతిపెద్ద విజయంగా నేను భావిస్తున్నా. ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు. హమాస్ ఆయుధాలను వదిలి.. బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుంది. ఇజ్రాయెల్‌ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తాం. లేదంటే వేటాడి మరీ హతమరుస్తామని హెచ్చరించారు.

 ఇది కూడా చదవండి: హమాస్‌ చీఫ్‌ సిన్వర్‌ మృతి.. బైడెన్‌ స్పందన ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement