జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మిలటరీలో పని చేస్తున్న ప్రతీ పురుషుడు మూడేళ్ల పాటు పని చేయాలన్న నిబంధనను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వార్త సంస్థ వైనెట్ కథనంలో తెలిపింది.
కాగా, ఓ వైపు హమాస్, మరోవైపు లెబనాన్ దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ప్రతీ పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్లకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక, తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్.. హమాస్, లెబనాన్‌పై ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే మిలటరీ ఎక్కువ సంఖ్యలో ఉండాలన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా భారీ సంఖ్యలో సైన్యం ఉండాలి. అందుకే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. హమాస్‌తో యుద్ధంలో తాము దాదాపుగా విజయానికి చేరువైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment