ఎర్ర సముద్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తత | CENTCOM Reports: Drones And Missiles Launched By Houthis Rebels In Southern Red Sea | Sakshi
Sakshi News home page

Red Sea Crisis: ఎర్ర సముద్రంలో 18 డ్రోన్‌ దాడులకు తెగబడిన హౌతీ రెబల్స్

Published Wed, Jan 10 2024 3:30 PM | Last Updated on Wed, Jan 10 2024 4:01 PM

CENTCOM Reports: Drones Missiles Launched By Houthi Rebels Southern Red Sea - Sakshi

వాషింగ్టన్‌: ఎర్ర సముద్రంలోని  యెమన్‌ హౌతీ రెబల్స్‌ దాడులతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్‌ 18 డ్రోన్‌ దాడులకు తెగపడిందని అమెరికా మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM)  ఓ నివేదికలో పేర్కొంది. మొత్తంగా గడిచిన ఏడు వారాల్లో హౌతీ రెబల్స్‌ సాయుధు దళాలు ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ వాణిజ్య చానెల్స్‌పై మొత్తం 26 సార్లు దాడులకు పాల్పడినట్లు తెలిపింది. అదేవిధంగా రెండు యాంటి షిప్‌ క్రూయిస్‌ మిసైల్స్‌, ఒక యాంటి బాలిస్టిక్‌ మిసైల్‌ను కూడా హౌతీ సాయుధ దళాలు ప్రయోగించినట్లు సీఈఎన్‌టీసీఓఎం వెల్లడించింది. సీఈఎన్‌టీసీఓఎం అనేది యూకే దేశ సహకారంతో నడిచే అమెరికా ఫోర్స్. 

ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించే​ హౌతీ రెబల్స్‌ ఇరాన్‌లో తయారైన మానవ రహిత ఏరియల్‌ వెహికిల్స్‌(యూఏవీ)తో పాటు యాంటి షిప్‌ క్రూయిజ్‌ మిసైల్స్‌, యాంటి షిప్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌తో దక్షిణ ఎర్ర సముద్రంలో దాడులు చేసిందని బుధవారం సీఈఎన్‌టీసీఓఎం ప్రకటించింది. ఎర్ర సముద్రంలోని పలు షిప్పింగ్‌ చానెల్స్‌పై హౌతీ రెబల్స్‌ దళాలు ఇప్పటివరకు మొత్తంగా 26 దాడులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌ భాగస్వామ్య హౌతీ రెబల్స్‌ ఎర్ర సముద్రంలో అలజడి సృష్టిస్తూ.. డ్రోన్‌ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే గాజాపై తీవ్రంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగానే ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్‌ దాడులు చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు ఆపేవరకు తమ దాడులు కొనసాగిస్తామని హౌతీ రెబల్స్‌ హెచ్చరిస్తోంది. యెమన్‌ హౌతీ రెబల్స్‌ ఇప్పటికే ఇజ్రాయెల్‌పై కూడా డ్రోన్‌, మిసైల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే హమాస్‌ దళాలు అక్టోబర్‌ 7 చేసిన మెరుపు దాడలకు ప్రతిగా ఇజ్రాయెల్‌.. గాజాపై దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలో హమాస్‌ సాయుధులను అంతం చేసేంతవరకు తమ దాడులు కొనసాగిస్తాని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

చదవండి:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్‌ అభ్యర్థులకు మంచు టెన్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement