జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందాడు. అయితే, గతేదాడి అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు ముందు సిన్వర్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ ఆరో తేదీన సిన్వర్ సొరంగంలోకి వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇజ్రాయెల్ వీడియో ప్రకారం.. సిన్వర్, అతడి కుటుంబ సభ్యులు కొన్ని వస్తువులతో సొరంగంలోకి వెళ్లడం కనిపిస్తుంది. ఇదే సమయంలో వారికి కావాల్సిన సామాగ్రిని సొరంగంలోకి తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సిన్వర్ సొరంగంలో దాక్కున్నట్టు స్పష్టం చేసింది. అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేసినట్టు ఆరోపించింది.
మరోవైపు.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు.
🎥DECLASSIFIED FOOTAGE:
Sinwar hours before the October 7 massacre: taking down his TV into his tunnel, hiding underneath his civilians, and preparing to watch his terrorists murder, kindap and rape. pic.twitter.com/wTAF9xAPLU— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 19, 2024
Comments
Please login to add a commentAdd a comment