జెరూసలేం: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. జియోనిస్ట్ దాడిలో ఇస్మాయిల్ మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ ప్రకటించింది. ఇక, ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని బృందం తెలిపింది.
కాగా, ఇరాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ మృతిచెందాడు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా టెహ్రాన్‌లోని అతని నివాసంపై జియోనిస్ట్‌లు దాడి చేయడంతో ఆయన మృతిచెందినట్టు పాలస్తీనా గ్రూప్ తెలిపింది. ఈ దాడిలో ఇస్మాయిల్‌తో పాటు అతడి బాడీగార్డ్ కూడా మరణించినట్టు చెప్పుకొచ్చింది.
కాగా, ఇస్మాయిల్ ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇస్మాయిల్ కుమారులు మృతిచెందారు.
BREAKING | The Iranian Revolutionary Guard announces the death of Ismail Haniyeh, head of the political bureau of the resistance in an lsraeli raid executed in Tehran. pic.twitter.com/wqq1fYQr5n
— TIMES OF GAZA (@Timesofgaza) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment