ఇజ్రాయెల్-గాజా యుద్ధం కొనసాగుతోంది. గాజాలోని హమాస్ సాయుధులను అంతం చేసేవరకు తమ దాడులు ఆపమని ఇజ్రాయెల్ దళాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్ హౌతీ ఉద్యమ నేత మహమ్మద్ అలీ అల్ హౌతీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో తమ ప్రమేయాన్ని సమర్థించుకున్నారు. అయితే తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని అన్నారు. కానీ, పాలస్తీనియన్లు వాళ్ల పని వారు చేస్తూ వెళ్తారని చెప్పారు.
మైళ్ల దూరంలో తనకు ఈ యుద్ధంలో ప్రమేయముందా అని అడిగినప్పడూ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. నెతన్యాహుకు పొరుగువాడా?, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒకే అంతస్తులో నివసిస్తున్నాడా? బ్రిటన్ ప్రధాని ఒకే భవనంలో ఉంటున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులతో తాము ఏం సాధించలేదని, అటువంటి సమయంలో అమెరికా తమని ఎందుకు వ్యతిరేక కూటమిగా భావిస్తోందని మండిపడ్డారు. ఇజ్రాయెల్ పోర్టుల్లో ఏం జరుగుతుందో వారే స్వయంగా చెబుతున్నారని అన్నారు. దీంతో తమ చర్యలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.
ఎవరు ఏం చేసినా తమ ప్రాభల్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నామని అన్నారు. తమకు చట్టబద్దత లేదని ఎవరు అన్నా పట్టించుకోమని తెలిపారు. నిజంగానే తమకు చట్టబద్దత లేకపోతే బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, యుఎఇతో సహా 17 దేశాలను ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమకు యెమెన్ ప్రజలే అండగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా తాము ఇజ్రాయెల్ హింసాత్మాక దాడులను ఎదుర్కొగలమని తెలిపారు. యెమెన్‌లోని ఇరాన్ అనుబంధ హౌతి సాయుధ గ్రూపు నవంబర్ 19 నుంచి సుమారు 20 కంటే ఎక్కువ నౌకలపై డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఈ దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment