
రఫా: గాజాలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, సెంట్రల్ గాజాలో 14 మంది చిన్నారులు, 8 మంది మహిళలు సహా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రఫా చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఫరూక్ మసీదు నేలమట్టం అయింది.
మరోవైపు, వెస్ట్‌బ్యాంక్ జాతీయరహదారిపై గురువారం ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ యువకుడు చనిపోగా మరో అయిదుగురు గాయప డ్డారు. ఇజ్రాయెల్ పోలీసుల కాల్పుల్లో ఇద్ద రు దుండగులు చనిపోయారు. మూడో వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కాల్పులకు కారణమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ హమాస్ సాయుధబలగాలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆగి, స్వతంత్ర పాలస్తీనా అవతరించేదాకా ఇటువంటి మరిన్ని దాడులకు దిగాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment