PV Sindhu: వరుస ఓటములు.. టాప్‌-10 నుంచి ఔట్‌ | PV Sindhu Drops Out Of World Top 10 Badminton Rankings | Sakshi
Sakshi News home page

PV Sindhu: వరుస ఓటములు.. టాప్‌-10 నుంచి ఔట్‌

Published Wed, Mar 29 2023 7:48 AM | Last Updated on Wed, Mar 29 2023 7:54 AM

PV Sindhu Drops Out Of World Top 10 Badminton Rankings - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు 2016 నవంబర్‌ తర్వాత తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌లో సింధు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయింది. ఈ ఫలితం ఆమె ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది.

మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ ఏడాది సింధు నాలుగు టోర్నీలలో పాల్గొని మూడింటిలో తొలి రౌండ్‌లో ఓడిపోయి, మరో టోరీ్నలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ని్రష్కమించింది. ప్రస్తుతం మాడ్రిడ్‌లో జరుగుతున్న స్పెయిన్‌ మాస్టర్స్‌ టోరీ్నలో సింధు బరిలో ఉంది.

భారత్‌కే చెందిన మరో స్టార్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సైనా నెహా్వల్‌ ఒక స్థానం ఎగబాకి 31వ ర్యాంక్‌లో నిలిచింది. జనవరిలో ఇండోనేసియా ఓపెన్‌ తర్వాత సైనా మరో టోరీ్నలో ఆడలేదు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొమ్మిదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... కిడాంబి శ్రీకాంత్‌ 21వ ర్యాంక్‌లో, లక్ష్య సేన్‌ 25వ ర్యాంక్‌లో నిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement