Priyanshu Rajawat
-
తరుణ్ సంచలనం
గువాహటి: కీలకదశలో పాయింట్లు సాధించిన తెలంగాణ బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించాడు. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నీలో టాప్ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ (భారత్)ను బోల్తా కొట్టించి తరుణ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ తరుణ్ 24–22, 15–21, 21–13తో ప్రియాన్షును మట్టికరిపించాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకొని గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రియాన్షు తేరుకోగా... నిర్ణాయక మూడో గేమ్‌లో తరుణ్ పైచేయి సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)తో తరుణ్ తలపడతాడు. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్, రవి, ఆయుశ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పోరాడి ఓడిన శ్రియాన్షి మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. వు లువో యు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో శ్రియాన్షి 21–19, 12–21, 12–21తో ఓడింది. భారత్‌కే చెందిన మాన్సి సింగ్, తన్వీ శర్మ, అన్మోల్ ఖరబ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప; ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల; రోహిత్–రిదువర్షిణి; అశిత్–అమృత; కనపురం సాతి్వక్ రెడ్డి–వైష్ణవి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. -
సెమీఫైనల్లో ప్రియాన్షు పరాజయం
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్ అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన ప్రియాన్షు సెమీఫైనల్లో మాత్రం తడబడ్డాడు. ప్రియాన్షుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు), 6,420 పాయింట్లు లభించాయి. -
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్‌కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్‌లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్‌లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్‌ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్‌లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీ విజేత ప్రియాన్షు
భారత బ్యాడ్మింటన్ యువతార, ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 21–15, 19–21, 21–16తో ప్రపంచ 49వ ర్యాంకర్ మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. ప్రియాన్షుకు 18,000 డాలర్ల (రూ. 14 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023