
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు పలు చోట్ల ఆడిషన్స్ జరిగిన 5వ మిస్ ఆసియా గ్లోబల్ అందాల పోటీల ఫైనల్స్ శుక్రవారం (నవంబర్ 1న) జరగనున్నాయని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న గోకులమ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతాయని, దీనిలో ప్రపంచవ్యాప్తంగా 26మంది ఫైనలిస్ట్‌లు పోటీ పడుతున్నారని వివరించారు. మలేషియా పర్యాటక మంత్రి ఈ ఈవెంట్‌కి అతిథిగా హాజరవుతున్నారని పేర్కొన్నారు.