ఫైనల్స్‌కు కర్నూలు, గుంటూరు
- హోరాహోరీగా రగ్బీ పోటీలు
కర్నూలు(టౌన్): నగర శివారులోని మాంటిస్సోరి ఇండస్ స్కూల్‌లో రగ్బీ చాంపియన్‌షిప్ క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి పురుషుల విభాగంలో కర్నూలు, గుంటూరు జట్లు, మహిళల విభాగంలో కడప, కర్నూలు జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల మొదటి సెమీఫైనల్‌లో కర్నూలు జట్టు 12–0 స్కోరుతో నెల్లూరు జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. అలాగే రెండో సెమీఫైనల్ పోటీలో గుంటూరు జట్టు 5–0 స్కోరుతో చిత్తూరు జట్టుపై గెలుపొంది ఫైనల్స్‌కు చేరింది. మహిళా విభాగం మొదటి సెమీఫైనల్‌లో కర్నూలు జట్టు 20–0 స్కోరుతో నెల్లూరుపై, కడప జట్టు 5–0 స్కోరుతో గుంటూరు జట్టుపై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతున్నాయి. ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ రెఫరీలుగా నోయల్, వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.