Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా సీఎస్‌కే రికార్డు సృష్టించినా.. ఆ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్‌గా.. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. కానీ ముంబై అలా కాదు.. నిష్క్రమిస్తే లీగ్ స్టేజీ.. లేదా ప్లేఆఫ్స్‌లో.. కానీ ఒక్కసారి ఫైనల్‌కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి.
ఐదుసార్లు ఛాంపియన్‌గా..
ఐపీఎల్‌లో ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌ది ఒకేరకమైన ఆటతీరు. తొలి రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపని ముంబై 2010లో మాత్రం తొలిసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2011, 2012ల్లో ప్లేఆఫ్స్‌కు పరిమితమైంది. 2013లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్ ఆటతీరు అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది.
అలా 2015, 2017, 2019 ఇలా బేసి సంఖ్య విధానంలో నాలుగుసార్లు ఛాంపియన్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్.. ODD Yearsలోనే కప్ కొడుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం కరెక్ట్ కాదని చెబుతూ 2020లో ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్.
ఆరంభంలో వరుస ఓటములు.. తర్వాత ఫుంజుకొని ఛాంపియన్‌గా
ఏ సీజన్ అయినా ముంబై ఇండియన్స్ తొలి అంచె పోటీల్లో ఎక్కువగా ఓటములను చవిచూస్తూనే వచ్చింది. ఛాంపియన్‌గా నిలిచిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్‌ను ఓటములతోనే ఆరంభించింది. మొదట వరుసగా ఓటములు.. మధ్యలో ఫుంజుకొని విజయాలతో బలంగా తయారవుతుంది. ప్రతీ సీజన్‌లో ఇదే స్ట్రాటజీతో కనిపించే ముంబై ఇండియన్స్ ఈసారి కూడా అదే ఆటతీరు కనబరిచింది.
ఈ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్‌సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది.
ప్లేఆఫ్‌కు వస్తే చాలు ఎక్కడలేని బలం..
ప్లేఆఫ్‌కు వచ్చిందంటే ముంబైలో ఎక్కడలేని బలం వస్తోంది. ప్రత్యర్థి జట్టు బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని కోలుకోలేని దెబ్బతీసి విజయం సాధించడం ముంబై స్ట్రాటజీ. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై అదే చేసింది. క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిందో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నిచడం ఖాయం. అందుకే ముంబై ఇండియన్స్‌ను క్వాలిఫయర్-2లోనే గుజరాత్ ఆపాలని సీఎస్‌కే అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది.
A MI-ghty special victory! 😎
— IndianPremierLeague (@IPL) May 24, 2023
The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn
📍Next Stop: Ahmedabad ✈#LSGvMI #TATAIPL #IPLonJioCinema #MumbaiIndians | @mipaltan pic.twitter.com/TRp8f0vugT
— JioCinema (@JioCinema) May 24, 2023
చదవండి: జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
Comments
Please login to add a commentAdd a comment