జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ ఫైనల్‌కు చేరింది.
పట్నా: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో రెండో సీడ్ రితూపర్ణ 21–11, 21–10తో అరుంధతి పంతవానెపై గెలిచింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ప్లేయర్ సిరిల్ వర్మ 16–21, 13–21తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయాడు.