సాక్షి, హైదరాబాద్: కేబీడీ జూనియర్స్ కబడ్డీ లీగ్‌లో లార్డ్స్ హైస్కూల్, కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ) జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. హైదరాబాద్ అంచె పోటీల్లో భాగంగా నగరానికి చెందిన ఎనిమిది జట్లు ఇందులో పాల్గొన్నాయి. పలు లీగ్ మ్యాచ్‌ల అనంతరం లార్డ్స్, ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్), ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. తొలి సెమీఫైనల్లో లార్డ్స్ హైస్కూల్ 20–14 స్కోరుతో ప్రభుత్వ స్కూల్ (బోడుప్పల్)పై విజయం సాధించింది. రైడింగ్‌లో తరుణ్ కుమార్ (లార్డ్స్) 9 పాయింట్లతో అదరగొట్టగా, డిఫెండర్ సంతోష్ (లార్డ్స్) 2 పాయింట్లు చేశాడు. రెండో సెమీఫైనల్లో కేంద్రీయ విద్యాలయ (గోల్కొండ; కేవీ–2) జట్టు 26–12తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై ఘనవిజయం సాధించింది. కేంద్రీయ విద్యాలయ ఆటగాళ్లు ఎడ్వర్డ్ లివ్‌స్టాన్ రైడింగ్‌లో 14 పాయింట్లు సాధించగా, డిఫెండర్ సుమన్‌దీప్ ప్రసాద్ 3 పాయింట్లు చేశాడు. రేపు లార్డ్స్, కేంద్రీయ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment