
హెల్సింకి (ఫిన్లాండ్): గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పోరుకు అర్హత సాధించాడు. పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో హుసాముద్దీన్ 3–2తో జన్‌బోలత్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కే చెందిన కవీందర్ బిష్త్‌తో హుసాముద్దీన్ తలపడతాడు.
మరో సెమీఫైనల్లో కవీందర్ 4–1తో జోర్డాన్ రోడ్రిగెజ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. 49 కేజీల విభాగంలో గోవింద్, 60 కేజీల విభాగంలో శివ థాపా కూడా ఫైనల్ చేరారు. సెమీస్‌లో గోవింద్ 5–0తో సోజన్ (రష్యా)పై, శివ థాపా 5–0తో వర్లమోవ్ (రష్యా)పై గెలిచారు. 91 కేజీల విభాగం సెమీఫైనల్లో సుమీత్ (భారత్) 0–5తో చెవోన్ క్లార్క్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు.