మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ జోడీ | Sikki Reddy Enters Finals in India International Challenge Badminton | Sakshi
Sakshi News home page

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ జోడీ

Published Sun, Oct 16 2022 6:15 AM | Last Updated on Sun, Oct 16 2022 6:15 AM

Sikki Reddy Enters Finals in India International Challenge Badminton - Sakshi

ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరింది. బెంగళూరులో      శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జోడీ 21–17, 14–21, 21–16తో షేక్‌ గౌస్‌–మనీషా (భారత్‌) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో అశ్విని పొన్నప్ప–సాయి ప్రతీక్‌ (భారత్‌)లతో సిక్కి–రోహన్‌ తలపడతారు.

మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో రుత్విక 21–16, 19–21, 21–16తో మాన్సి సింగ్‌ (భారత్‌)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో తాన్యా హేమంత్‌తో రుత్విక ఆడుతుంది. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గరగ కృష్ణప్రసాద్‌ (భారత్‌) జోడీ 15–21, 18–21తో చలోంపన్‌–నాంథకర్న్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement