International Challenge badminton
-
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరింది. బెంగళూరులో శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–17, 14–21, 21–16తో షేక్ గౌస్–మనీషా (భారత్) ద్వయంపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో అశ్విని పొన్నప్ప–సాయి ప్రతీక్ (భారత్)లతో సిక్కి–రోహన్ తలపడతారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో రుత్విక 21–16, 19–21, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో తాన్యా హేమంత్‌తో రుత్విక ఆడుతుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 15–21, 18–21తో చలోంపన్–నాంథకర్న్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
India Maharashtra International Challenge 2022: ఫైనల్లో రుత్విక శివాని
సాక్షి, హైదరాబాద్: ఇండియా మహారాష్ట్ర ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 24–22, 21–17తో ఇషారాణి బారువా (భారత్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రుత్విక 25–23, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 23–21, 21–9తో తారా షా (భారత్)పై, రెండో రౌండ్లో 21–14, 21–9తో ప్రణవి (భారత్)పై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ ప్లేయర్ మిహో కయామతో రుత్విక శివాని తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మిహో కయామ 21–14, 21–15తో తస్నీమ్ మీర్ (భారత్)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కె.మనీషా–షేక్ గౌస్ (భారత్) జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో మనీషా–షేక్ గౌస్ ద్వయం 21–12, 19–21, 21–17తో బొక్కా నవనీత్–ప్రియా కొంజెంగ్‌బమ్ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో మైస్నమ్ మెరాబా (భారత్), మిథున్ మంజునాథ్ (భారత్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో మైస్నమ్ మెరాబా 22–20, 21–14తో టాప్ సీడ్ కిరణ్ జార్జి (భారత్)పై, మిథున్ 22–24, 21–7, 21–18తో రవి (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణ ప్రసాద్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చోలెంపన్–నాంథకర్న్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సిక్కి రెడ్డి జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: లాగోస్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన ప్రద్న్యా గాద్రెతో కలిసి బరిలోకి దిగిన సిక్కి రెడ్డి ఫైనల్లో 21-19, 21-23, 21-15తో ఒజ్గె బరాక్-నెష్లిహాన్ యిగిట్ (టర్కీ) ద్వయంపై గెలిచింది. సెమీఫైనల్లో సిక్కి-ప్రద్న్యా జోడీ 17-21, 21-14, 21-18తో రెండో సీడ్, ప్రపంచ 20వ ర్యాంక్ జంట హీతెర్ ఒల్వెర్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్)పై సంచలన విజయం సాధించింది. నైజీరి యాలో జరిగిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సిక్కి రెడ్డి రన్నరప్‌తో సంతృప్తి పడింది. హైదరాబాద్‌కే చెందిన కోనా తరుణ్‌తో కలిసి ఆడిన సిక్కి ఫైనల్లో 19-21, 8-21తో రాబర్ట్ మతెసుయెక్-నదియా జీబా (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.