సిక్కి రెడ్డి జంటకు డబుల్స్ టైటిల్ | sikki reddy Doubles Title | Sakshi
Sakshi News home page

సిక్కి రెడ్డి జంటకు డబుల్స్ టైటిల్

Published Mon, Jul 20 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

సిక్కి రెడ్డి జంటకు డబుల్స్ టైటిల్

సిక్కి రెడ్డి జంటకు డబుల్స్ టైటిల్

 సాక్షి, హైదరాబాద్: లాగోస్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన ప్రద్న్యా గాద్రెతో కలిసి బరిలోకి దిగిన సిక్కి రెడ్డి ఫైనల్లో 21-19, 21-23, 21-15తో ఒజ్గె బరాక్-నెష్లిహాన్ యిగిట్ (టర్కీ) ద్వయంపై గెలిచింది. సెమీఫైనల్లో సిక్కి-ప్రద్న్యా జోడీ 17-21, 21-14, 21-18తో రెండో సీడ్, ప్రపంచ 20వ ర్యాంక్ జంట హీతెర్ ఒల్వెర్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్)పై సంచలన విజయం సాధించింది. నైజీరి యాలో జరిగిన ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సిక్కి రెడ్డి రన్నరప్‌తో సంతృప్తి పడింది. హైదరాబాద్‌కే చెందిన కోనా తరుణ్‌తో కలిసి ఆడిన సిక్కి ఫైనల్లో 19-21, 8-21తో రాబర్ట్ మతెసుయెక్-నదియా జీబా (పోలండ్) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement