మరోవైపు అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 6–11, 8–11, 11–4, 11–4, 14–16, 12–10, 11–5తో జీత్ చంద్ర (హరియాణా)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 10–12, 11–4, 11–5, 12–14, 11–5, 11–7తో రాజేశ్ (మహారాష్ట్ర)ను ఓడించాడు. అండర్–17 ఆర్చరీ బాలుర కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుందేరు వెంకటాద్రి కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక పోరులో వెంకటాద్రి 148–142తో యశ్ దూబేపై విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment