జైపూర్‌ పేట్రియాట్స్‌ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్‌... ఆగస్టులో యూటీటీ లీగ్‌... | Akula Sreeja and Snehit in the Jaipur Patriots team | Sakshi
Sakshi News home page

జైపూర్‌ పేట్రియాట్స్‌ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్‌... ఆగస్టులో యూటీటీ లీగ్‌...

Published Thu, Jul 11 2024 3:27 AM | Last Updated on Thu, Jul 11 2024 3:27 AM

Akula Sreeja and Snehit in the Jaipur Patriots team

అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) లీగ్‌ ఐదో సీజన్‌ కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 16 మంది విదేశీ క్రీడాకారులు. భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్‌ జైపూర్‌ పేట్రియాట్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. 

ప్రపంచ 25వ ర్యాంకర్‌ శ్రీజ గత నెలలో నైజీరియా లో జరిగిన వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో సింగిల్స్‌, డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గింది. ఆగస్టు 22 నుంచి సెపె్టంబర్‌ 7 వరకు చెన్నైలో జరిగే యూటీటీ లీగ్‌లో అహ్మదాబాద్‌ ఎస్‌జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్‌ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్‌ పేట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్, యు ముంబా జట్లు పాల్గొంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement