కబడ్డీ విజేత శ్రీసత్యసాయి | Kabaddi champion srisatyasai | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేత శ్రీసత్యసాయి

Published Tue, Nov 8 2016 12:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ (గుంతకల్లు) జట్టుపై శ్రీ సత్యసాయి(అనంతపురం) జట్టు విజయం సాధించింది.

గుంతకల్లు టౌన్:
జిల్లా జూనియర్‌ కాలేజీల అథ్లెటిక్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో పలు  క్రీడాపోటీల ఫైనల్‌ మ్యాచ్‌లు సోమవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ (గుంతకల్లు) జట్టుపై శ్రీ సత్యసాయి(అనంతపురం) జట్టు విజయం సాధించింది. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులు కలిగిన సత్యసాయి జట్టు ప్రత్యర్థి జట్టుపై (31–3 పాయింట్‌లతో) చిత్తు చేసింది. 
 
విజేతల వివరాలు: 
► వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి (అనంతపురం), ఎల్‌ఆర్‌జీ (హిందూపురం) జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో చివరకు ఎల్‌ఆర్‌జీ జట్టు విజయ దుందుభి మోగించింది.  
► టెన్నికాయిట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ (ఉరవకొండ) జట్టుపై ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ (గుంతకల్లు) జట్టు విజయం సాధించింది.  
► ఖోఖో ఫైనల్‌ మ్యాచ్‌లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ (ఉరవకొండ) జట్టుపై ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గర్లŠస్‌ (ఉరవకొండ) జట్టు గెలుపొందింది. 
►  త్రోబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ (కదిరి)పై కేఎస్‌ఆర్‌ (అనంతపురం) జట్టు విజయం సాధించింది.  
► చదరంగం ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌ఎస్‌జీఎస్‌ (గుంతకల్లు) క్రీడాకారిణీపై ఏపీ మోడల్‌ స్కూల్‌ (అగళి) క్రీడాకారిణి విజయం సాధించినట్లు కాలేజీ ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాసులు, ఏడీజేసీఏఏ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్‌లు తెలియజేశారు. నేటి నుంచి అథ్లెటిక్స్‌ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారిణులు, ఫిజికల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement