కామన్‌వెల్త్ గేమ్స్-2022 అఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు.
ఇక ఓవరాల్‌గా అఖరి రోజు భారత్‌కు ఇది ఐదో పతకం. అంతకుముందు పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది.
మరో వైపు టేబుల్ టెన్నిస్ కాంస్య పతక పోరులో జ్ఞానశేఖరన్ సాతియన్ విజయం సాధించాడు. భారత్ ఇప్పటి వరకు 22 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 60 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి
Comments
Please login to add a commentAdd a comment