smash
-
‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
సొకా (జపాన్): తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి ఇన్నాళ్లూ ఇంటాబయటా డబుల్స్ టైటిల్స్‌తో పతాక శీర్షికల్లో నిలిచాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచాడు. మేటి డబుల్స్ షట్లర్‌గా రాటుదేలిన సాత్విక్‌కు టైటిళ్లు కొత్తేం కాదు. అయితే తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్‌తో సాత్విక్ రికార్డు సృష్టించాడు. జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్‌కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఫార్ములావన్ సర్క్యూట్లో రయ్ రయ్‌మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! బ్యాడ్మింటన్‌లో ఇది అసాధారణ వేగం. దీంతో దశాబ్దం క్రిందట మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్‌లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ప్రస్తుతం కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఆడుతున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–14తో సుపక్ జోమ్కో–కిటినిపోంగ్ కెద్రెన్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్‌కే చెందిన ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. -
క్వార్టర్ ఫైనల్లో మనిక–సత్యన్ జోడీ ఓటమి, ముగిసిన భారత పోరాటం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్ టోరీ్నలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ 9–11, 9–11, 11–8, 11–5, 7–11తో హినా హయాటా–టొమొకాజు హరిమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) జోడీ 2–11, 6–11, 15–13, 12–10, 6–11తో మెంగ్ చెన్–యిది వాంగ్ (చైనా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
Singapore Smash 2023: క్వార్టర్ ఫైనల్లో మనిక జోడీ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ సింగపూర్ స్మాష్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనిక బత్రా–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగపూర్‌లో సోమవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మనిక–సత్యన్ ద్వయం 11–7, 12–10, 9–11, 11–3తో జెంగ్ జియాన్–క్లారెన్స్ చ్యూ (సింగపూర్) జోడీపై గెలిచింది. మనిక–సత్యన్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన హరిమోతో–హినా హయాటా ద్వయంతో మనిక–సత్యన్ ఆడతారు. -
మొక్కలు బుగ్గిపాలు
బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరి తహారం కార్యక్రమంలో నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలను దగ్ధం చేసిన ఘటన ఇది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోనే నిమ్మ, జామ, మామిడి మొక్కలను మంగళవారం తగులబెట్టారు. ఈ విషయాన్ని గమనించిన సీపీఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి, నాయకులు మహబూబ్, గంగరబోయిన సమ్మయ్య, రంగు బాలకృష్ణ, గుంటిపల్లి హరినాథ్, ఆంజనేయులు మాట్లాడుతూ మొక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అద్భుత ప్రతిభ
-
కోపంతో లగ్జరీ కార్లు బద్దలు కొట్టేసుకున్నారు
బీజింగ్: ఇద్దరు భార్యభర్తల మధ్య కోపం వస్తే ఏం జరుగుతుంది. ఈమె నాలుగు మాటలంటుంది.. ఆయన మాటలంటాడు. కొంత కోపిష్టి భర్తయితే చేతివాటం చూపిస్తాడు. అదే భార్యకు కోపం ఎక్కువయితే, ఇంట్లో వస్తువులు గాల్లో లేస్తాయి. అవసరం అయితే, భర్తపై రాళ్ల మాదిరి పడతాయి. కానీ, తీవ్ర ఆగ్రహావేశానికి లోనయిన ఇద్దరు చైనా భార్యభర్తలు ఏం చేశారో తెలుసా.. ఏకంగా వారి లగ్జరీ కార్లను బద్ధలు కొట్టేసుకున్నారు. అసలు విషయానికి వస్తే వారిద్దరు ఈ మధ్యే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా ఆస్తి పంపకాల వంతొచ్చింది. అయితే, ఆ పంపకాల విషయంలో తేడా వచ్చింది. చెరొకమాట అనుకున్నారు. ఆ తర్వాత తీవ్ర కోపానికి లోనైన భార్య తన బీఎండబ్ల్యూ కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ, భర్త తన బ్లాక్ మెర్సిడీస్ కారుతో ఆమెను వెంబడించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో ఆమె కారు ధ్వంసం అయింది. దీంతో చిర్రెత్తిన భార్య నా కారే ధ్వంసం చేస్తావా అని అతడి కారుపై కూడా దాడి చేసి బద్ధలు కొట్టేసింది.