మొక్కలు బుగ్గిపాలు
మొక్కలు బుగ్గిపాలు
Published Tue, Aug 16 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరి తహారం కార్యక్రమంలో నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలను దగ్ధం చేసిన ఘటన ఇది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోనే నిమ్మ, జామ, మామిడి మొక్కలను మంగళవారం తగులబెట్టారు.
ఈ విషయాన్ని గమనించిన సీపీఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి, నాయకులు మహబూబ్, గంగరబోయిన సమ్మయ్య, రంగు బాలకృష్ణ, గుంటిపల్లి హరినాథ్, ఆంజనేయులు మాట్లాడుతూ మొక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement