harithaharm
-
నేలమ్మా క్షమించు..
ఈ భూతలమ్మీద జీవానికే జేజమ్మ నేలతల్లి. మనందరం ఈ నేలమ్మ ముద్దు బిడ్డలమే. భూమి మీద ఉన్న జీవవైవిధ్యం కన్నా భూమి లోపల జీవవైవిధ్యం ఎక్కువ. అడవిలోని అత్యంత సారవంతమైన మట్టి జీవన ద్రవ్యంతో జీవజీవాలతో ఉంటుంది. అందుకే అడవి ఎంత ఎండల్లోనూ ఎండిపోకుండా సతత హరితంగా అలరారుతూ ఉంటుంది. అడవిలో చెట్ల కింద మట్టి అత్యంత సారవంతంగా, సజీవంగా ఉంటుంది. దీన్ని చెంచాడు తీసుకొని పరీక్షించి చూస్తే.. భూగోళంపైన మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యవసాయ నేలల్లోనూ సూక్ష్మజీవరాశిని పెంపొందించుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే భూసారాన్ని పెంపొందించగలవు, పరిరక్షించగలవు. నేలతల్లి చల్లగుంటేనే మనమూ చల్లగా ఉంటాం. నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన నేలలు సకల పోషకాలతో సజీవంగా ఉంటేనే మనం పండించే ఆహారంలోనూ పోషకాల లోపం లేకుండా ఉంటుంది. నేలతల్లి అమూల్యమైన ప్రకృతి సేవలతో మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు సహా సకల జీవరాశికి ప్రాణం పోస్తుంది. అటువంటి నేలతల్లి అనేక రకాల కాలుష్యాల వల్ల, పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల క్రమంగా నిర్జీవమవుతోంది, నిస్సారమవుతోంది. ఇప్పటికే మూడింట ఒక వంతు సాగు భూమి నిర్జీవంగా, సాగు యోగ్యం కాకుండా మారిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులతో కూడిన నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకశక్తిని, తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 20 లక్షల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోతోంది. సముద్రం తర్వాత అధికంగా కర్బనం నిల్వలు కలిగి ఉన్న భూమి జవజీవాలను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భూతాపోన్నతిని అరికట్టగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. భూమిని కాలుష్యాల నుంచి రక్షించుకుందాం అని ఎఫ్.ఏ.ఓ. ఈ ఏడాది డిసెంబర్ 5న అంతర్జాతీయ భూముల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ బృహత్ కృషిలో ప్రకృతి వ్యవసాయదారులే సైనికులు! అయినా.. సమయం మించి పోలేదు భూముల విధ్వంసాన్ని నిలువరించగలం భూమిని కాలుష్యం నుంచి పరిరక్షించడానికి భూసారాన్ని పెంపొందించే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు చేపట్టడంతో పాటు.. అనేక ఇతర రంగాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవాలి. పారిశ్రామిక రంగం, గనుల తవ్వకం, వ్యర్థాల పునర్వినియోగం, రవాణా రంగాలలో కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల పద్ధతులు కూడా పాటిస్తూ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపడితే... భూములను కాలుష్యం బారి నుంచి పూర్తిగా కాపాడుకోగలుగుతాం. -
మొక్కలు బుగ్గిపాలు
బచ్చన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరి తహారం కార్యక్రమంలో నాటేందుకు తీసుకొచ్చిన మొక్కలను దగ్ధం చేసిన ఘటన ఇది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలోనే నిమ్మ, జామ, మామిడి మొక్కలను మంగళవారం తగులబెట్టారు. ఈ విషయాన్ని గమనించిన సీపీఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి, నాయకులు మహబూబ్, గంగరబోయిన సమ్మయ్య, రంగు బాలకృష్ణ, గుంటిపల్లి హరినాథ్, ఆంజనేయులు మాట్లాడుతూ మొక్కల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చౌలమద్దిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా...
జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మెట్‌పల్లిరూరల్: తన స్వగ్రామం చౌలమద్దిని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. మండలంలోని తన స్వగ్రామం చౌలమద్దిలో గురువారం మొక్కలు నాటి మాట్లాడారు. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల నిర్మాణం, హరితహారాన్ని విజయవంతంచేయాలని కోరారు. పరిశుభ్రతను పాటించి స్వచ్ఛభారత్‌లో ముందుండాలని సూచించారు. గ్రామానికి అవసరమైన పనులన్నింటికీ నిధులు కేటాయిస్తానన్నారు. ప్రతీ పని నాణ్యతగా జరిగేటట్లు చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులు వినియోగించుకోవాలన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ ఇండియా లాంటి పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. తుల రాజేందర్, సర్పంచులు వాసాల లక్ష్మి, తొట్ల లక్ష్మిచిన్నయ్య, ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో షరీఫ్, కార్యదర్శి అశోక్, వినయ్, మదాం నడ్పిరాజం, రాంరెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతీ ఇల్లు హరితవనం కావాలి..
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ 13.56 లక్షల మొక్కలు నాటిన పోలీసులు ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ప్రతీ ఇల్లు ఒక హరితవనం కావాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణ శివారులోని సీసీఐ కాలనీ జీఎస్ ఎస్టేట్‌లో హరితహారం నిర్వహించారు. 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఎస్పీకి కాలనీ చిన్నారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల 56 వేల మొక్కలు నాటామని, రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అన్నారు. కాలనీలోని ప్రతీ ఇంట్లో పది మొక్కలు నాటాలని సూచించారు. ఆదివారం ఒకే రోజు లక్షా 6 వేల మొక్కలు నాటామన్నారు. పోలీసులు మొక్కలు నాటడంతోపాటు గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతీ రోజు లక్ష మొక్కలు నాటే ప్రణాళిక పెట్టుకున్నామని తెలిపారు. జనమైత్రి పోలీసు అధికారులకు స్థానిక యువకులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఏఎస్సై జి.అప్పారావు, కాలనీవాసులు బి.కిషన్‌రావు, ఉత్తూరు సందీప్, వి.గంగాధర్, రాజేందర్ శర్మ, శేషగిరి, భాస్కరాచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.